EPAPER
Saturday, May 16, 2026
Google search engine

ఆదర్శ గ్రామంగా గాంధీపురం..!

📰 Generate e-Paper Clip

ఆదర్శ గ్రామంగా గాంధీపురం..!
… కులాల్ని గెలిచిన ప్రేమ వివాహాలు..!
… కులాల కుడ్యాలను బద్దలు కొట్టిన విప్లవం.
… కొన్నేళ్ల నుండి పెద్దలను ఆదర్శంగా తీసుకున్న యువత.
… ఆదర్శ దంపతులకు ప్రభుత్వం అండగా నిలవాలి.

మహబూబాబాద్ / జనం వాయిస్ :

మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలోని  గాంధీపురం గ్రామం నేడు దేశానికే ఒక దిక్సూచిగా నిలిచింది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ గ్రామంగా పేరుంది. గత కొన్నేళ్ల నుండి కులం, మతం పేరిట సమాజం విడిపోతున్న ప్రస్తుత తరుణంలో, ఈ గ్రామంలో సుమారు 60 శాతం కులాంతర వివాహాలు జరగడం ఒక సామాజిక అద్భుతం. ఆధునిక భారతదేశంలో ఇంకా మూఢనమ్మకాలు, కుల అహంకారాలు రాజ్యమేలుతున్న వేళ, గాంధీపురం యువత సృష్టించిన ఈ మార్పు ప్రశంసనీయం.

కరకుడ్యాల మధ్య వెలిగిన వెలుగు..,
ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంటే కులం తక్కువంటూ తల్లిదండ్రులు, బంధువులు అఘాత్యాలకు ఒడిగట్టిన సంఘటనలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ‘గౌరవ ప్రదమైన హత్యలు’ (ఆనర్ కిల్లింగ్స్) పేరిట కన్నబిడ్డల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడనంతగా కులజాడ్యం సమాజాన్ని పట్టిపీడిస్తోంది. ఇటువంటి కఠిన సామాజిక పరిస్థితుల మధ్య, ఒకే గ్రామంలో 60 శాతానికి పైగా కులాంతర వివాహాలు జరగడం ఆషామాషీ విషయం కాదు. ఇది కేవలం యువత తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, కొన్నేళ్ల నుండి గ్రామ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీ.., ఆ ఊరి పెద్దల ఆలోచనా విధానంలో వచ్చిన గొప్ప మార్పుకు నిదర్శనం.

ప్రభుత్వ సహాయం అత్యవసరం.
ఈ విప్లవాత్మక మార్పును కేవలం అభినందించి వదిలేస్తే సరిపోదు. కుల రహిత సమాజ స్థాపనకు పునాది వేసిన ఈ ఆదర్శ దంపతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాలను తక్షణమే అందించాలి.  కుటుంబాల నుంచి దూరమైన దంపతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదా స్వయం ఉపాధిలో ప్రాధాన్యత ఇవ్వాలి.  గాంధీపురం గ్రామాన్ని అధికారికంగా ‘ఆదర్శ గ్రామం’గా ప్రకటించి, ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించాలి. గాంధీపురం గ్రామం చూపిన బాటలో మిగిలిన సమాజం నడవాలి. కులాల గోడలను కూల్చి, మానవత్వమే కులంగా బతుకుతున్న ఈ దంపతులకు అండగా నిలవడం పాలకుల కనీస ధర్మం.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!