EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

విద్యార్థిపై దాడి.. ఆర్టీసీ డ్రైవర్‌పై వేటు..!

📰 Generate e-Paper Clip

విద్యార్థిపై దాడి.. ఆర్టీసీ డ్రైవర్‌పై వేటు..!

  • విధుల నుంచి తొలగిస్తూ టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు.

మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (జనం వాయిస్):

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు సమీపంలో పాఠశాల విద్యార్థిపై అసభ్యకరంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ స్వామి (స్టాఫ్ నం.2047)పై టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. టిఎస్26టీ1266 బస్సు డ్రైవర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో డ్రైవర్‌ బాధ్యతారాహిత్యంగా, దురుసుగా వ్యవహరించినట్లు తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ప్రయాణికుల భద్రతే తొలి ప్రాధాన్యం
విద్యార్థులు, మహిళలు, వృద్ధులు సహా ప్రతి ప్రయాణికుడితో ఆర్టీసీ సిబ్బంది మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందేనని యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత, గౌరవానికి భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించింది. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!