EPAPER
Wednesday, July 1, 2026
Google search engine

పదవీ విరమణ పొందిన పంచాయతీ సెక్రటరీ  శామ్ సుందర్ రెడ్డికి ఘన సన్మానం.

📰 Generate e-Paper Clip

పదవీ విరమణ పొందిన పంచాయతీ సెక్రటరీ  శామ్ సుందర్ రెడ్డికి ఘన సన్మానం.

యాచారం, జూన్ 30, (జనం వాయిస్ ):

గ్రామ పంచాయతీల్లో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన యాచారం మండలం నంది వనపర్తి పంచాయతీ సెక్రెటరీ శామ్ సుందర్ రెడ్డి (1990 బ్యాచ్) మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నంది వనపర్తి కార్యాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించి, శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమనికి మాడ్గుల ఎంపీడీవో విజయలక్ష్మి,యాచారం ఏపీవో శ్రీలత,గ్రామ సర్పంచ్ రాయికంటి విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ కంబాలపల్లి ఉదయ్ శ్రీ, బి.ఎన్. రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ..
1990లో పంచాయతీ సెక్రటరీ గా విధుల్లో చేరిన ఆయన, తన సుదీర్ఘ సేవా కాలంలో క్రమశిక్షణ, అంకితభావం,నిజాయితీతో ప్రజలకు సేవలందిస్తూ ఆదర్శ అధికారిగా గుర్తింపు పొందారని,శామ్ సుందర్ రెడ్డి సేవలను కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించిన ఆయన సేవలు చిరస్మరణీయమని వారు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో పంచాయతీరాజ్ డిఇ శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్ శ్రీశైలం, సెక్రెటరీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఆయన విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!