నవంబర్ 13 లోపు పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలి.
-జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి.
జనం వాయిస్,పెద్దపల్లి:
నవంబర్ 13 లోపు పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ పరీక్షల విభాగం డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం పదవ తరగతి, ఒకేషనల్, ఓ ఎస్సిస్సి మార్చి-2026 పరీక్షలు రాసే విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 13 లోగా ఫీజు చెల్లించాలని తెలిపారు. రూ.50=00 ఫైన్ తో నవంబర్-29 వరకు, రూ.200=00 ఫైన్ తో డిసెంబర్-11 వరకు, రూ.500=00 లేట్ ఫీజుతో డిసెంబర్-29 వరకు ఫీజు చెల్లించవచ్చని , పరీక్ష ఫీజు, దరఖాస్తుల వివరాలు సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు వద్ద లభిస్తాయని తెలిపారు.రెగ్యులర్ విద్యార్థులు రూ.125=00, ఫెయిల్ అయిన విద్యార్థులు 3 సబ్జెక్టుల వరకు రూ.110=00, 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులు రాసేవారు రూ.125=00 ఫీజుగా చెల్లించాలని, మిగతా వివరాలకు www.bse.telangana.gov.in వెబ్ సైట్ సందర్శించాలని, నోటిఫికేషన్ లో సూచించిన ఫీజు కాకుండా అదనంగా ఫీజులు విద్యార్థుల నుండి వసూలు చేయరాదని, అలా వసూలు చేసిన పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ ఆధికారి,డి.మాధవి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments