EPAPER
Monday, February 16, 2026
Google search engine

నేడు వీధి కుక్కల పై సుప్రీంకోర్టు తీర్పు.

📰 Generate e-Paper Clip

నేడు వీధి కుక్కల పై సుప్రీంకోర్టు తీర్పు.

జనం వాయిస్,హైదరాబాద్,నవంబర్ 07:

వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యా సంస్థలు,ఆసుపత్రులు,క్రీడా సముదాయాలు, బస్ డిపోలు,రైల్వే స్టేషన్ల నుంచి వీధి కుక్కలను తీసుకెళ్లాలని చెప్పింది.ఆయా ప్రాంగణాల్లో ఉన్న అన్ని కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేయించి, వ్యాక్సిన్ వేయించాలని చెప్పింది. శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో విడిచిపెట్టరాదని స్పష్టం చేసింది.ఎందుకంటే,శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో విడిచిపెడితే సుప్రీంకోర్టు ఇస్తున్న ఆదేశాల ఉద్దేశం వ్యర్థమవుతుందని చెప్పింది.వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.ప్రజా భద్రతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.సుప్రీంకోర్టు న్యాయమూర్తు లు జస్టిస్ విక్రమ్ నాథ్,సందీప్ మెహతా,ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ వీధి కుక్కల కాట్ల కేసులపై విచారణ జరుపుతూ ఈ ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల కేసులో పూర్తి తీర్పు త్వరలోనే వెలువడనుంది.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు వారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వైద్య సంస్థలు, ప్రజా రవాణా కేంద్రాలు, క్రీడా మైదానాలను గుర్తించాలని,8 వారాల్లో వాటిని ఫెన్సింగ్‌లతో కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ప్రతి ప్రాంగణానికి పర్యవేక్షణ బాధ్యత కలిగిన అధికారి ఉండాలని,స్థానిక మున్సిపల్ సంస్థలు,పంచాయతీలు మూడు నెలలపాటు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని తెలిపింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!