మావోయిస్టులు వామపక్ష పార్టీలు ఏకం కావాలి.
ప్రజా స్వామ్య బద్దంగా హక్కుల సాధన కోసం పోరాడుదాం.
త్యాగాలు కమ్యూనిస్టులవి భోగాలు మతోన్మాదులవి.
ప్రజా పోరాటాల పార్టీ సిపిఐ.
సిపిఐ వందేళ్ల ముగింపు సభను విజయవంతం చేయాలి .
సిపిఐ నేతలు చాడా వెంకట్ రెడ్డి, తక్కళ్ళపెల్లి శ్రీనివాస రావు లు.
జనంవాయిస్, గోదావరిఖని, నవంబర్ 16:
దేశంలో ప్రజా, కార్మికుల హక్కుల సాధన కోసం, మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజా స్వామ్య బద్దంగా పోరాటాలు నిర్వహించేందుకు మావోయిస్టులు, వామపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపెల్లి శ్రీనివాస రావు లు పేర్కొన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 22 వరకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని జోడేఘాట్ నుంచి భద్రాచలం వరకు జరిగే బస్ జాతా ఆదివారం గోదావరిఖని కి చేరుకున్న సందర్భంగా ముందుగా సిపిఐ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు బస్ జాతా కు గంగానగర్ వద్ద స్వాగతం పలుకుతూ అక్కడ నుంచి గోదావరిఖని మెయిన్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీగా వచ్చి బస్ జాతా లో ఉన్న నాయకులకు సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో పూలదండలు వేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అనంతరం చాడా వెంకట్ రెడ్డి, తక్కళ్ళపెల్లి శ్రీనివాస రావు లు
మాట్లాడుతూ దేశంలో ఎర్ర జెండా నీడన పని చేస్తున్న మావోయిస్టులు, వామపక్ష పార్టీలు ఐక్యంగా లేక విడిగా ఉండి ఉద్యమాలు చేయడం వల్ల మతోన్మాద పార్టీ లు భోగాలు అనుభవిస్తూ ప్రజలను, కార్మికుల ను అనేక విధాలుగా నష్టం చేస్తున్నాయని, త్యాగాలు కమ్యూనిస్టులవి భోగాలు మతోన్మాదులవి అని వారు పేర్కొన్నారు. అందుకే ప్రజా, కార్మికుల హక్కుల సాధన కోసం మావోయిస్టులు, వామపక్ష పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని సిపిఐ వంద సంవత్సరాల సందర్భంగా పిలుపు నిస్తుందని వారు పేర్కొన్నారు. దేశంలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిపిఐ పార్టీ ఇప్పటివరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజల ఆదరణ పొందిందని సిపిఐ త్యాగం వెలకట్టలేనిదని నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐ పార్టీ కి ఉందని వారు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటాలు నిర్వహించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి దక్కిందని వారు తెలిపారు. అదేవిధంగా కోల్ బెల్ట్ ప్రాంతంలో ఉన్న సింగరేణి కార్మికులకు చెందిన అనేక సమస్యలపై నిరంతరం పోరాటం నిర్వహించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నదని వారు అన్నారు. 2025 డిసెంబర్ 26న ఖమ్మం లో జరిగే వంద సంవత్సరాల ముగింపు సభను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ లకు తాకట్టు పెడుతుందని అదేవిధంగా నిత్యావసర ధరలు అనేక ప్రజా సమస్యలు పట్టించుకోకుండా హిందుత్వం ఏజెండగా పనిచేస్తుందని అలాగే ప్రజల కోసం పనిచేస్తున్న నక్సలైట్ పార్టీ నాయకులను పట్టుకొని చంపుతున్నారని అడివిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పి కనీసం ఉద్యోగాలు లేక నిరుద్యోగులు , యువకులు ప్రజలు పట్టణాల్లో కూలీలుగా మారారని వారు అన్నారు. దేశంలో అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరిస్తూ ప్రశ్నించే గొంతులను అర్బన్ నక్సలైట్ పేరుతో అరెస్టు చేయడం ఎన్కౌంటర్లు చేయడం జరుగుతుందని వారు అన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణి శంకర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్, తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు కన్నం లక్ష్మి నారాయణ, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, గౌతం గోవర్ధన్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, మహిళా సమాఖ్య నాయకురాలు మడికొండ ఓదెమ్మ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపూరి సూర్య, నాయకులు ఎల్ ప్రకాష్, కందుకూరి రాజారత్నం, తాళ్ళపెళ్లి మల్లయ్య, మాటేటి శంకర్, ఆసాల రమ, తొడుపునూరి రమేశ్ కుమార్, వై.లెనిన్, ఎం.ఎ.గౌస్, ఆర్ లక్ష్మణ్, పడాల కనకరాజు, శేఖర్, కరీం, తిరుమల, ఏ.వి.ఎస్ ప్రకాశ్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments