EPAPER
Thursday, April 2, 2026
Google search engine

గురుకులాల పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ.-ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.

📰 Generate e-Paper Clip

గురుకులాల పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ.

విద్యార్థులు కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి.

ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.


జనం వాయిస్,మంథని:

గురుకులాల పైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (బాలురు) ఆయన తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ శ్రీనాథ్, వైస్ ప్రిన్సిపాల్ నవీన్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ రవి, బోధన, బోధనేతర బృందం ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు రికార్డులను ఆయన పరిశీలించారు.విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…. ప్రభుత్వం గురుకులాల పైన ప్రత్యేక శ్రద్ధ వహించిందని, విద్యార్థులు గురుకులాలను ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని ఆయన సూచించారు. విద్యార్థులకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచాలని ప్రిన్సిపాల్ ను సూచించారు. పిల్లలకు అందిస్తున్నటువంటి ఆహార విషయంలో, చదువు విషయంలో సంతృప్తి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించినటువంటి పెండింగ్ పనులను అధికారులతో సమన్వయ పరచుకొని పూర్తిచేయాలని ఆయన సూచించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను వచ్చే పరీక్షలకు సంసిద్ధత చేయాలని ఆయన సూచించారు. గురుకులాల విద్యార్థులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రేణుకుంట ప్రవీణ్, రమేష్, కుస్రం నీలదేవి,శంకర్, పెద్దపల్లి జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవీందర్, మంథని ఆర్డిఓ సురేష్, పెద్దపెల్లి జిల్లా గురుకులాల కోఆర్డినేటర్ దేవసేన, మంథని ఎమ్మార్వో కుమారస్వామి, ఎస్సై రమేష్, సీనియర్ అధ్యాపకులు సరిత, బోధన, బోధనేతర బృందం, తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!