సర్పంచ్ ల ఫోరం ముత్తారం మండల అధ్యక్షుడిగా బియ్యని శివకుమార్ నియామకం.
జనం వాయిస్, ముత్తారం:
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మైదంబండ సర్పంచ్ బియ్యని శివ కుమార్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నియమించారు. ఈ సందర్భంగా ముత్తారం మండలం సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, మైదంబండ సర్పంచ్ బియ్యని శివ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన నియామకానికి సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ఏఎంసీ డైరెక్టర్ లు బోల్నేని బుచ్చం రావు, జాగిరి సమ్మయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, బీసీ సెల్ మండల అధ్యక్షుడు అల్లం కుమారస్వామి, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ఎడవెన సంపత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోవిందుల పద్మ, సర్పంచ్ లు చిలివేరి జ్యోతి లక్ష్మణ్, మెంగని సమత తిరుపతి, పెగుడ తిరుమల కుమార్,రాపెల్లి రాజయ్య, బొంతల అన్నపూర్ణ ఉపేందర్, గడ్డం రాజేశం,చొప్పరి సంపత్,తాని ప్రభాకర్, ఇండ్ల కృష్ణవేణి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments