EPAPER
Wednesday, March 18, 2026
Google search engine

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు  విజయం సాధించాలి.

📰 Generate e-Paper Clip

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు  విజయం సాధించాలి.

– ముందస్తుగా తెలుగు సంవత్సరం వేడుకలు.

– కాకతీయ పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి.

జనం వాయిస్, మంథని:

తెలుగు సంవత్సరమైనా ఉగాది వేడుకలు కాకతీయ పాఠశాలలో ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మంథని పట్టణం కాకతీయ పాఠశాలలో శ్రీ పరాభవ నామ సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ముందస్తుగా ప్రిన్సిపాల్ ప్రదీప్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఉగాది పచ్చడి, భక్ష్యాలు అందరికీ పంపిణీ చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాటుచేసిన కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. విద్యార్థుల ఉద్దేశించి  ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతి విద్యార్థి తెలుగు సంవత్సరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. సాంప్రదాయ బద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులందరూ పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు. యుగం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే అత్యంత గొప్ప పండుగ ఉగాది అని పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత సాంకేతిక రోజుల్లో తెలుగు సంవత్సరాలు మర్చిపోవడం జరుగుతుందని, ప్రతి విద్యార్థి వాటి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఉగాది వేడుకలలో విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, స్రవంతి రెడ్డి, పావని రెడ్డి, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!