వి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
– దాతలు ముందుకు రావాలి: సురభి శ్రీధర్.
జనం వాయిస్, గోదావరిఖని:
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మల్లికార్జున్ నగర్ ప్రాంతానికి చెందిన మెకానిక్ జాఫర్ గత ఐదు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తన కాలు విరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న జాఫర్ కుటుంబానికి వెలుగు సామాజిక స్వచ్ఛ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ లు గడవేన సునీత, డా.సదానందం సహకారంతో నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ హాజరై మాట్లాడారు. సమస్య ఎక్కడ ఉంటుందో తమ వెలుగు సంస్థ తమ వంతు గా సహాయం అందిస్తూ రావడం జరుగుతుందని సురభి శ్రీధర్ తెలిపారు. గోదావరిఖని మల్లికార్జున్ నగర్ చెందిన టూ వీలర్ మెకానిక్ జాఫర్ 20 సంవత్సరాలుగా మెకానిక్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ రావడం జరిగిందని, గత ఐదు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగిపోయి నడవలేని పరిస్థితిలో ఉండి మంచానికే అంకితం కావడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, వైద్య ఖర్చులకోసం డబ్బులు పెట్టుకునే స్తోమత లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని తెలుసుకొని జాఫర్ కుటుంబానికి తమ వంతు సహాయంగా తమ సంస్థ ఆర్గనైజర్ ల సహకారంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దాతలు ఎవరైనా ఉంటే జాఫర్ వైద్య ఖర్చులకోసం సహాయ సహకారాలు అందించాలని సురభి శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకురాలు ఉరకొండ రజిత, జాఫర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments