వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 100% ఫీజులో రాయితీ కల్పించాలి.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు జర్నలిస్ట్ సంఘాల వినతి.
జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ 22:
వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు 100 % ఫీజు రాయితీ కల్పించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్,జర్నలిస్టుల సంక్షేమ సంఘం, ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపెల్లి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న వారందరికీ 100% రాయితీ కల్పించాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల మధ్యకు తీసుకొని వెళుతున్న జర్నలిస్టులకు ఎలాంటి జీతభత్యాలు ఉండవని, అలాంటి జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 100% రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా అందించడం జరిగిందని, కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు స్టేట్ ఆర్గనైజర్ సెక్రెటరీ అవునూరి సంపత్ , జెఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్, జెఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వోడ్నాల తిరుపతి, అనిల్,సంతోష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments