EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం

📰 Generate e-Paper Clip

గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.

జనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 2:

మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గాంధీజీ పాటించిన సత్యం, అహింస, న్యాయబద్ధత, సహనం వంటి విలువలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఫలితాలు త్వరగా రావాలని కోరుకుంటున్నారని, అయితే గాంధీజీ తన జీవితంలో ఎప్పుడూ స్వల్ప మార్గాలను అనుసరించలేదన్నారు. న్యాయబద్ధమైన మార్గంలో ఓపికతో, నిరంతరంగా పోరాడుతూ అనేక విజయాలు సాధించారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్‌ ఇండియా ఉద్యమం, విదేశీ వస్త్రాల బహిష్కరణ వంటి కార్యక్రమాలు ఒక్కరోజులో విజయవంతం కాలేదని, గాంధీజీ తన సిద్ధాంతాలపై నమ్మకంతో నిరంతరం చేసిన కృషి ఫలితంగానే అవి సఫలీకృతమయ్యాయని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో జైలు శిక్షలు సహా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ గాంధీజీ తన లక్ష్యాన్ని, సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా పోరాటాన్ని కొనసాగించారని అన్నారు. గాంధీజీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్య సాధన కోసం నిరంతరం కృషి చేస్తే తప్పక ఫలితం లభిస్తుందని కలెక్టర్ సూచించారు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ బండి ప్రకాష్‌తో పాటు జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!