EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

వివాహితపై కానిస్టేబుల్‌ అత్యాచారం.

📰 Generate e-Paper Clip

వివాహితపై కానిస్టేబుల్‌ అత్యాచారం.

వీడియోలతో బెదిరించి రూ.1.30 లక్షలు వసూలు.

జనం వాయిస్, జయశంకర్‌ భూపాలపల్లి, అక్టోబర్ 6:

పదో తరగతి నాటి పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఓ వివాహితపై టీజీఎస్పీ కానిస్టేబుల్‌ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. అనంతరం ఆ ఘటనను రహస్యంగా చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెడతానంటూ బెదిరిస్తూ బాధితురాలిని పలుమార్లు వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. అంతేకాకుండా వీడియోలు బయటపెడతానని బెదిరించి రూ.1.30 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి తన భర్తతో కలిసి కరీంనగర్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు పదో తరగతిలో పరిచయమైన ఉదయ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని టీజీఎస్పీ ఎనిమిదో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. పాత పరిచయంతో ఆమెతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఏడాది మార్చి 3న కరీంనగర్‌లో తనపై అత్యాచారానికి పాల్పడి, ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించినట్లు ఆరోపించింది. ఆ తర్వాత ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరిస్తూ లైంగికంగా వేధించడంతోపాటు, ఈ ఏడాది ఆగస్టు 20, 21 తేదీల్లో రూ.1.30 లక్షలు తీసుకున్నట్లు తెలిపింది. డబ్బులు ఇచ్చినప్పటికీ వేధింపులు ఆగలేదని పేర్కొంది. నిందితుడు తన ఇంటికి వచ్చి గొడవ చేయడంతోపాటు, తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను భర్తకు పంపినట్లు ఆరోపించింది. దీంతో భర్త, కుటుంబ సభ్యులు తనను ఇంటి నుంచి పంపించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ వేధింపుల సమయంలో తాను గర్భవతిగా ఉండగా గర్భస్రావం కూడా జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలు తొలుత జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును కరీంనగర్‌ గ్రామీణ పోలీసులకు బదిలీ చేశారు. దీంతో కరీంనగర్‌ గ్రామీణ పోలీసులు నిందితుడు ఉదయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆరోపణలపై పూర్తి వివరాలను దర్యాప్తులో తేల్చనున్నట్లు పోలీసులు తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!