EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

రేషన్ షాపు కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ కార్పొరేటర్ అభ్యంతరం.

📰 Generate e-Paper Clip

రేషన్ షాపు కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ కార్పొరేటర్ అభ్యంతరం.

  • స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి కేటాయించడంపై నిరసన.
  • ఆర్‌టీఐ ద్వారా వివరాలు సేకరిస్తాం: మడిపెల్లి విజయ మల్లేష్.
  • ఏకపక్ష కేటాయింపును రద్దు చేసి స్థానిక అర్హులకు అవకాశం కల్పించాలని డిమాండ్.

జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 7:

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్‌కు సంబంధించిన 3612058 రేషన్ దుకాణాన్ని స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతానికి చెందిన వారికి కేటాయించడంపై 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధికి సమాచారం ఇవ్వకుండా, కనీసం సంప్రదించకుండా అధికారులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, 1వ డివిజన్ ప్రజల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తున్నామని తెలిపారు. డివిజన్ పరిధిలోని రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా, సమయానికి అందాలంటే రేషన్ దుకాణం నిర్వహణ స్థానికుల చేతిలో ఉండటం అవసరమన్నారు. ఇతర ప్రాంతాల వారికి దుకాణాన్ని కేటాయించడం వల్ల భవిష్యత్తులో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రేషన్ దుకాణం కేటాయింపు ఏ నిబంధనల ప్రకారం జరిగిందో, అర్హతలు, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరిస్తామని విజయ మల్లేష్ తెలిపారు. కేటాయింపులో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయా అనే అంశంపై సమగ్రంగా తెలుసుకుంటామని అన్నారు.

1వ డివిజన్‌కు సంబంధించిన రేషన్ దుకాణం కేటాయింపును పునఃపరిశీలించి, అర్హులైన స్థానిక నిరుద్యోగులు లేదా స్థానిక లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధికి సమాచారం లేకుండా కేటాయింపు ఎలా జరిగిందో అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు. స్థానిక ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ డిమాండ్ చేశారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!