EPAPER
Saturday, September 12, 2026
Google search engine

నేటి నుంచి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు

📰 Generate e-Paper Clip

నేటి నుంచి పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తులు

జనం వాయిస్, హైదరాబాద్, ఆగస్టు 19:

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు, అనుబంధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణతో ప్రారంభ మైంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు టీజీపీఆర్‌బీ, ఆధ్వ ర్యంలో నిర్వహించే ఈ ప్రక్రియ కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgprb.in లో నేటి ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నియామకాల్లో పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీ ఎఫ్ ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ విభాగా ల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్, ఏఆర్, టీజీఎస్పీ), అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్ బ్యూరో), భారీ సంఖ్యలో సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఫైర్ ఫైటర్లు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, జైళ్ల శాఖలో వార్డర్లు, డిప్యూటీ జైలర్ పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా 3,697 సివిల్ కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం ఈసారి అభ్యర్థుల వయో పరిమితిని పెంచడం తో దరఖాస్తుదారుల సంఖ్య మునుపటి కంటే భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోం ది. దరఖాస్తు ప్రక్రియ లో ఎలాంటి అక్రమా లకు తావులేకుండా పారదర్శకత కోసం అధికారులు ఈసారి ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేశారు. దీనికోసం అభ్యర్థులు తమ ఫోన్లలో ముందుగానే ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. దరఖాస్తు విధానం పార్ట్-1, పార్ట్-2ల ద్వారా జరుగుతుంది. అభ్యర్థులు తమ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకున్న తర్వాత అవసరమైన విద్యార్హత ధ్రువపత్రా లు, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, సంతకాన్ని నిర్దేశిత పరిమాణంలో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ వరకు వేచి చూడకుండా అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో వెంటనే దరఖాస్తు చేసుకో వాలని సూచించారు. సకాలంలో దరఖాస్తులు పూర్తి చేసి అభ్యర్థులు తమ అర్హతకు తగ్గ పోస్టు లకు పోటీపడవచ్చు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!