మంచిర్యాల–వరంగల్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు ఆటంకాలు లేకుండా చర్యలు : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
టైటిల్ క్లియర్ ఉన్న రైతులకు పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలి.
పోతారం గ్రామంలో నేషనల్ హైవే నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్.
జనం వాయిస్, ముత్తారం, పెద్దపల్లి, ఆగస్టు 18:
మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ముత్తారం తహసిల్దార్ కార్యాలయంలో నేషనల్ హైవే నిర్మాణ పనుల పురోగతి, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం చెల్లింపుల సమస్యల కారణంగా క్షేత్రస్థాయిలో పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు నేషనల్ హైవే అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. పోతారం, సర్వారం, ఓడేడు, లక్కారం ప్రాంతాలకు చెందిన రైతులు, నిర్వాసితులతో సమావేశంలో చర్చించిన కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టైటిల్ క్లియర్‌గా ఉన్న రైతులకు సంబంధించి పరిహారం చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భూసేకరణ, పరిహారం చెల్లింపులు తదితర అంశాల్లో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను రైతులతో చర్చించి పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు, నిర్వాసితులకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని, సమస్యల కారణంగా జాతీయ రహదారి నిర్మాణ పనులు నిలిచిపోకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రైతులకు నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం ముత్తారం మండలంలోని పోతారం గ్రామంలో జరుగుతున్న నేషనల్ హైవే నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు, నిర్వాసితులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ నిర్మాణ పనులు సజావుగా కొనసాగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంథని ఆర్డిఓ సురేష్, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్, ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, సంబంధిత అధికారులు, పోతారం, సర్వారం, ఓడేడు, లక్కారం ప్రాంతాల రైతులు, నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments