ప్రజాప్రతినిధుల మాటలు ప్రకటనలకేనా..?
– ధాన్యం కటింగ్ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
– ప్రభుత్వ తీరు పై ముత్తారం మాజీ సింగిల్విండో ఛైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి ఆగ్రహం.
జనం వాయిస్, ముత్తారం, మే 22:
పెద్దపల్లి జిల్లా అంతటా ధాన్యం గింజ కటింగ్ లేకుండా చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటనలు చేస్తుంటే ముత్తారం మండలం లోని రైతులను కటింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ముత్తారం మండల మాజీ సింగల్ విండో చైర్మెన్ గుజ్జుల రాజిరెడ్డి శుక్రవారం ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రులు ఎంఎల్ఎ లు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కటింగ్ లేకుండా చివరి గింజవరకు కొనుగోలు చేస్తామని చెపుతుంటే ముత్తారం మండలం లోని కొనుగోలు కేంద్రాల నుండి తూకం వేసాక లోడు తో వెళ్ళిన లారీ లు మిల్లుల వద్ద దించు కోవడానికి ఎందుకు జాప్యం జరుగుతుందని ప్రశ్నించారు. కటింగ్ పేరుతో రైతులను నట్టేట ముంచుతున్నారని కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం నిల్వలు ఎక్కడి వక్కడే ఉన్నాయని ఆరోపించారు. కటింగ్ లేకుండా తూకం వేసి రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments