EPAPER
Tuesday, June 23, 2026
Google search engine

నేటి రాశి ఫలాలు.. 23-06-2026.

📰 Generate e-Paper Clip

నేటి రాశి ఫలాలు.. 23-06-2026.


మేషం

సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.


వృషభం

ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిలువ ఉండదు.


మిధునం

ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడులు అదిగమిస్తారు.


కర్కాటకం

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.


సింహం

విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలు సానుకూల ఫలితానిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల అంచనాలు నిజం అవుతాయి.


కన్య

దైవ చింతన పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.


తుల

విలువైన వస్తులాభాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.


వృశ్చికం

ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో కొంత పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.


ధనస్సు

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు.


మకరం

చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. దూరప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. బంధు మిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి.

కుంభం

సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక లాభాలుంటాయి.

మీనం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తు వాహన లాభాలు అందుకుంటారు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!