EPAPER
Monday, June 22, 2026
Google search engine

జూలై 6 వరకు అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.

📰 Generate e-Paper Clip

జూలై 6 వరకు అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.

జనం వాయిస్, పెద్దపల్లి, జూన్ -22:

పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఐసీడీఎస్ రామగుండం ప్రాజెక్టులో 4 పోస్టులు, ఐసీడీఎస్ పెద్దపల్లి ప్రాజెక్టులో 17 పోస్టులు, ఐసీడీఎస్ మంథని ప్రాజెక్టులో 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు. https://mis.tgwdcw.nic.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని, జూలై 6, 2026 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు సంబంధిత అంగన్‌వాడీ కేంద్రం ఉన్న గ్రామం లేదా మున్సిపల్ వార్డుకు చెందిన స్థానిక మహిళలై ఉండాలని, ఇంటర్‌మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. 01-07-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయబడతాయని పేర్కొన్నారు. వినికిడి యంత్రాల సహాయంతో వినగలిగే హెచ్‌హెచ్ (Hearing Handicapped) అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుతో పాటు ఎస్‌ఎస్‌సీ మెమో (వయస్సు ధృవీకరణ పత్రం), జనన ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, ఇంటర్‌మీడియట్ సర్టిఫికేట్, దివ్యాంగుల సదరం సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం, అనాథ ధృవీకరణ పత్రం తదితర పత్రాలను జతపరచాలని సూచించారు. ప్రజావాణి లేదా కార్యాలయాల్లో నేరుగా సమర్పించిన దరఖాస్తులు స్వీకరించబడవని, ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ఈ నియామక ప్రక్రియను ఏ దశలోనైనా రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!