EPAPER
Friday, September 18, 2026
Google search engine

విశ్వకర్మ జయంతి సందర్భంగా అడవిశ్రీరాంపూర్ లో జెండా ఆవిష్కరణ.

📰 Generate e-Paper Clip

విశ్వకర్మ జయంతి సందర్భంగా అడవిశ్రీరాంపూర్ లో జెండా ఆవిష్కరణ.

జనం వాయిస్, ముత్తారం, సెప్టెంబర్ 17:

విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని అడవిశ్రీరాంపూర్‌లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో విశ్వకర్మలు అందిస్తున్న సేవలు, వారి వృత్తి నైపుణ్యాలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. కార్యక్రమంలో అకోజు అశోక్, అకోజు రమేష్, పాంచాల చక్రపాణి, తేజనా మూర్తి, మారుపాక మధుకర్, సతీష్, కరుణాకర్, సంపూర్ణ చారి, వెంకటేష్ చారి, రామగిరి రాజేశంతో పాటు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!