EPAPER
Saturday, September 12, 2026
Google search engine

ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌లో మిస్‌ఫైర్..

📰 Generate e-Paper Clip

ఎన్టీపీసీ సీఐఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌లో మిస్‌ఫైర్..

హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు.
తుపాకీ మ్యాగజైన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలిన బుల్లెట్. కరీంనగర్‌కు హాస్పిటల్ కు తరలింపు.

జనం వాయిస్, రామగుండం, జూన్ 21:

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ పరిధిలో ఉన్న సీఐఎస్ఎఫ్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఉదయం ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ టింకు తన విధుల్లో భాగంగా తుపాకీ మ్యాగజైన్‌ను శుభ్రపరుస్తుండగా అకస్మాత్తుగా తుపాకీ పేలింది. ఈ ఘటనలో బుల్లెట్ సమీపంలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తొంటి భాగంలోకి దూసుకెళ్లడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన శ్రీనివాస్‌కు తొలుత ఎన్టీపీసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, ఈ విషయాన్ని ఎన్టీపీసీ యాజమాన్యం గోప్యంగా ఉంచుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఘటనకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రమాదానికి గల కారణాలపై సీఐఎస్ఎఫ్ అధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!