EPAPER
Wednesday, April 22, 2026
Google search engine

రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె.

📰 Generate e-Paper Clip

రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె.

– నేటి అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్న బస్సులు.

– ఇదే చివరి సమ్మె కావాలి: జేఏసీ.

జనం వాయిస్, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21:

ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సమ్మె తథ్యమని స్పష్టమవుతున్నది. ఇదే జరిగితే మంగళవారం అర్ధరాత్రి నుంచే మొదటి డ్యూటీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈలోగా సమ్మెను నిరోధించేందుకు ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపడితే తప్ప ఈ నెల 22 నుంచి సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తున్నా యి. సమ్మె గడువు దగ్గరపడుతున్నా ప్రభు త్వం నుంచి చర్చల ఊసే లేకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ తీసుకోకపోతే కచ్చితంగా సమ్మె జరుగుతుందని తేల్చిచెప్తున్నారు. నిరుడు మే 6న సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించిన ఆర్టీసీ కార్మికులతో ప్రభు త్వం చర్చలు జరిపి, సమ్మెకు వెళ్లకుండా అడ్డుకున్నది. ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి చల నం లేకపోవడంతో సమ్మెకు వెళ్లడమే సరైన నిర్ణయమని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భావిస్తున్నది. సమ్మెకు వెళ్తున్న కార్మికులపై పలు డిపోల్లో అధికారులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షలకు వెరవకుండా సమ్మెకు తరలిరావాలని కార్మికులకు జేఏసీ పిలుపునిచ్చింది. కార్మికులు ఐక్యతతో గట్టిగా పోడాడితే ఆర్టీసీలో ఇదే చివరి సమ్మె అవుతుందని జేఏసీ నేతలు చెప్తున్నారు. తమతో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరుపకపోతే మంగళవారం అర్ధరాత్రి నుంచే బస్సులు డిపోల్లో ఆగిపోతాయని, బుధవారం ఉద యం నుంచే సమ్మె పూర్తిస్థాయిలో ప్రారంభమవుతుందని చెప్తున్నారు.

ముఖ్యమంత్రి పైనే భారం.

ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై యాజమాన్యం పూర్తిగా చేతులెత్తేసే దిశ గా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా సమ్మె డిమాండ్లతో తమకు ఎలాంటి సం బంధం లేదని లేబర్‌ కమిషన్‌కు పంపిన లేఖలో స్పష్టం చేసింది. దీంతో సీఎం నేరుగా రంగంలోకి దిగితే తప్ప తమ సమస్యలకు పరిష్కారం లభించదని కార్మికులు భావిస్తున్నా రు. మంగళవారం సాయంత్రంలోగా తమ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలువకపోతే సమ్మె తథ్యమని స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు కార్మిక సంఘాలపై నిషేధం ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్లు మినహా మిగతా డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్నది. కానీ, ప్రధాన డిమాండ్లను పరిష్కరించకుండా ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిరోధించడం ఎలాగన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతున్నది.

సమ్మెకు కలిసి వస్తామన్న ఇతర సంఘాలు..

దీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్నో వినతులు సమర్పించినా స్పందన లేకపోవడంతో తాము సైతం సమ్మెకు కలిసి వస్తామని జేఏసీలో లేని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం మీడియా సమావేశం నిర్వహించి, తమ కార్యాచరణ ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు యూనియన్ల పునరుద్ధరించాలని, 2021, 2025 వేతన సవరణ, 2017 పీఆర్సీ బకాయిలు, రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సహా అన్ని సమస్యలను మంగళవారం మధ్యాహ్నంలోగా పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో 22 నుంచి జరిగే సమ్మెకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!