EPAPER
Wednesday, April 22, 2026
Google search engine

పేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు.

📰 Generate e-Paper Clip

పేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు.

జనం వాయిస్, పెద్దపల్లి, ఏప్రిల్ 21:

పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన పొన్నవేణి వినోద – సదయ్య యాదవ్ ల కూతురు పావని వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బియ్యం మరియు పెళ్ళి కూతురు పావని కి పెళ్ళీ చీర అందివ్వడం జరిగింది. ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ మాట్లాడుతూ గత 22 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవకార్యక్రమాలు చేస్తున్నానని, పేదలకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కారే శారద శ్రీనివాస్, ఎంచర్ల అంజయ్య, దాడి రమేష్, కొయ్యడ కళ్యాణ్, కేసవేణి హరీష్, అప్పల హరీష్, కారే నరేష్ ,చెగొండ శ్రావణ్, నెల్లి సందీప్, గుండా సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!