పెద్దపల్లి జిల్లాకు చెందిన తండ్రి-కొడుకుల ఘనత.
– అభినంధించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
జనం వాయిస్, పెద్దపల్లి, మే 07:
పెద్దపల్లి జిల్లాకు చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ మౌంటనీర్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ లెంకల మహిపాల్ రెడ్డి తన కుమారుడు లెంకల వివేకానంద రెడ్డితో కలిసి 2026 మే 2న ఆస్ట్రేలియా ఖండంలోనే అత్యంత ఎత్తైన శిఖరం అయిన మౌంట్ కోసియాస్కో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. పర్వత శిఖరంపై వారు “Say No To Drugs” అనే బ్యానర్‌ను ఆవిష్కరించి, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సందేశాన్ని ఇచ్చారు. ఇదివరకు కూడా వీరిద్దరూ రష్యాలోని యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష తండ్రి-కొడుకులిద్దరినీ అభినందించి, భవిష్యత్తులో మరిన్ని పర్వతాలను అధిరోహించి రాష్ట్రం మరియు దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డి.యం.ఓ.ప్రవీణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments