ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ రేంజ్ స్కూటర్.
జనం వాయిస్, బెంగళూరు, ఏప్రిల్ 19:
భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ సంస్థ సింపుల్ ఎనర్జీ అత్యధిక రేంజ్ అందించే అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యంతో ఈ స్కూటర్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ స్కూటర్ విక్రయాలు ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ స్కూటర్‌లో 6.5 కిలోవాట్ అవర్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీను అమర్చారు. కంపెనీ అంచనా ప్రకారం ఇది 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే బెంగళూరు నుంచి చెన్నై వరకు కూడా సులభంగా ప్రయాణించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఇది ఎక్కువ రేంజ్‌ను అందించడం విశేషంగా చెప్పుకోవాలి.
పనితీరు విషయంలో కూడా ఈ స్కూటర్ ముందంజలో ఉంది. గరిష్టంగా గంటకు 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. కేవలం 2.77 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. దీంతో ఇది దేశంలో వేగవంతమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలుస్తోంది. భద్రత, సౌలభ్యం కోసం ఆధునిక సాంకేతికతను ఇందులో పొందుపరిచారు. నాలుగు స్థాయిల ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉండటంతో తడి లేదా జారే రోడ్లపై స్కూటర్ జారిపోకుండా ఉంటుంది. అలాగే 7 అంగుళాల పెద్ద డిజిటల్ డిస్‌ప్లే ద్వారా నావిగేషన్, రైడ్ మోడ్‌లు, బ్యాటరీ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ స్కూటర్ ధర సుమారు రూ.2.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, కొచ్చి, గోవా వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే విక్రయాలు జరుగుతుండగా, త్వరలో మరిన్ని నగరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments