ఏప్రిల్ 20 లోగా దరఖాస్తులు, మేనేజ్మెంట్ లేఖలు సమర్పించిన వారి పేర్లు తొలి జాబితాలో పరిశీలన.-డిపిఆర్ఓ జగన్.
– ఏప్రిల్ 20 తర్వాత వచ్చే దరఖాస్తులు తదుపరి జాబితాలో పరిశీలన.
– ఒరిజినల్ మేనేజ్మెంట్ లేఖలకే ప్రాధాన్యం.. జిరాక్స్ పత్రాలు పరిగణనలోకి రావు.
జనం వాయిస్, పెద్దపల్లి, ఏప్రిల్- 19:
ఏప్రిల్ 20 లోగా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించి, దరఖాస్తులతో పాటు సంబంధిత ఒరిజినల్ మేనేజ్మెంట్ లేఖలను డిపిఆర్ఓ కార్యాలయంలో అందజేసిన మీడియా ప్రతినిధుల పేర్లు మొదటి జాబితా కొరకు పరిశీలన చేసి కమిటీ ఆమోదం మేరకు అక్రెడిటేషన్ లు మంజూరు చేయనున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి బి. జగన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న అక్రెడిటేషన్ కాలపరిమితి ఏప్రిల్ 30తో ముగియనున్నందున నూతన అక్రెడిటేషన్ లు జారీ చేయవలసి ఉన్నదని, మీడియా ప్రతినిధుల అక్రెడిటేషన్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ఏప్రిల్ 20 లోగా వచ్చిన పేర్లను మొదటి జాబితాలో, తదుపరి వచ్చే దరఖాస్తులు, మేనేజ్మెంట్ లేఖలను రెండవ విడతలో పరిశీలించ నున్నట్లు తెలిపారు. జిరాక్స్ లేదా కలర్ జిరాక్స్ మేనేజ్మెంట్ లేఖలను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అర్హత గల మీడియా ప్రతినిధులు సూచించిన మార్గదర్శకాలను అనుసరించి దరఖాస్తులు సమర్పించాలని డీపీఆర్ఓ జగన్ ఆ ప్రకటనలో కోరారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments