EPAPER
Tuesday, July 21, 2026
Google search engine

కాటారం వేదికగా రేపు రెండో విడత రైతు భరోసా నిధులు.!

📰 Generate e-Paper Clip

కాటారం వేదికగా రేపు రెండో విడత రైతు భరోసా నిధులు.!

రైతులకు రూ.5,653 కోట్ల పెట్టుబడి సహాయం!

జనం వాయిస్, వెబ్ డెస్క్:

తెలంగాణలోని రైతులకు రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి రంగం సిద్ధమైంది సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరిపల్లి,లో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సమక్షంలో ల్యాప్ టాప్ బటన్ మీద నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. రెండో విడత కింద 45, 11,947 మంది రైతుల ఖాతాల్లో రూ.2,063 కోట్లు జమకానున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో జరిగే బహిరంగ సభ నుంచే సీఎం ఈ నిధులను విడుదల చేస్తారు. రాష్ట్రంలో 73 లక్షల మంది రైతులు ఉన్నారు. యాసంగి రైతు భరోసా సాయం కింద మార్చి 23న ప్రతి రైతుకూ ఒక్కో ఎకరానికీ రూ.6వేల చొప్పున దాదాపు రూ.3,590 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇప్పుడు రెండో విడత కింద దాదాపు 36.72 లక్షల ఎకరాలకు చెందిన అన్నదాతలకు రైతు భరోసా అందనుంది. రెండు విడతల్లో కలిపి రైతులకు మొత్తం రూ.5,653 కోట్ల సాయం అందినట్లవుతుం దని వ్యవసాయ శాఖ వెల్లడించింది. మూడో విడత నిధులను వీలైనంత త్వరగా అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కాగా, సీఎం రేవంత్‌ సోమవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించనున్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కాటారం లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!