పెళ్లికి ముందు “ట్రాఫిక్ క్యారెక్టర్ సర్టిఫికేట్”..
కూతురు భవిష్యత్తు కోసం తండ్రి వినూత్న ఆలోచన..!
జనం వాయిస్, కాకినాడ:
పెళ్లి అంటే కేవలం ఆస్తులు, ఉద్యోగాలు, కుటుంబ నేపథ్యం చూసే కాలం మాత్రమే కాదు.. వ్యక్తిత్వం, బాధ్యత, సమాజం పట్ల ప్రవర్తన కూడా ముఖ్యమని కాకినాడలో జరిగిన ఓ ఘటన మరోసారి గుర్తు చేసింది.
తన కూతురికి కాబోయే అల్లుడు నిజంగా బాధ్యతాయుతమైన వ్యక్తేనా..? రోడ్డు నిబంధనలు పాటిస్తాడా..? మద్యం సేవించి వాహనం నడిపే అలవాటు ఉందా..? అనే విషయాలు తెలుసుకోవాలని ఓ తండ్రి వినూత్నంగా ఆలోచించారు. యువకుడి ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్, కారు-బైక్ నంబర్లతో ట్రాఫిక్ పోలీసులను సంప్రదించి పూర్తి సమాచారం తీసుకున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలపై పరిశీలించిన అధికారులు.. అతడిపై ఎలాంటి కేసులు లేదా పెండింగ్ చలానాలు లేవని తెలిపారు. ఈ సందర్భంగా ఆ తండ్రి తీసుకున్న జాగ్రత్తను ట్రాఫిక్ CI ప్రత్యేకంగా అభినందించారు.
సమాజానికి ఒక సందేశం
ఇప్పటి యువతలో రోడ్డు భద్రతపై అవగాహన చాలా అవసరం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం కేవలం జరిమానాలు తప్పించుకోవడానికే కాదు.. కుటుంబ భద్రత, ప్రాణాల రక్షణ కోసం కూడా ఎంతో ముఖ్యం. పెళ్లి సంబంధాల్లో వ్యక్తి ప్రవర్తన, బాధ్యతాయుత జీవనశైలి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందనే చర్చకు ఈ ఘటన దారి తీసింది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments