EPAPER
Saturday, September 12, 2026
Google search engine

సిద్దిపేట జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు!

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లాలో బావిలోకి దూసుకెళ్లిన కారు!

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జల సమాధి!

జనం వాయిస్, సిద్దిపేట జిల్లా, ఆగస్టు 20:

సిద్దిపేట జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది,దుబ్బాక మండలం అప్పన్న పల్లి గ్రామ శివారులో ఓ కారు బావిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడిక క్కడే ప్రాణాలు కోల్పో యారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా అర్ధరాత్రి వేళ ఈ దారుణం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో బల వంతపూర్ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఒకే కుటుంబంలోని నలుగురిని.. కాలం కారు రూపంలో కబ లించేసింది.సిద్దిపేట జిల్లా దుబ్బాక మం డలం బల్వంతపూర్ కు చెందిన దండుగుల రాజు (30) ఇసుక వ్యాపారం చేస్తుంటాడు అతని భార్య భాగ్య (25) కుమారుడు నిహాన్స్ (4)కుమార్తె శాన్విక (2)తో కలిసి సిద్దిపేట లో బంధువు దిశదిన కర్మకు హాజరై తిరిగి రాత్రివేళ వస్తుండగా…అప్పన్న పల్లి శివారులోకి రాగానే కారు అదుపు తప్పి బావిలోకి దూసుకెళ్లిం ది కొంతసేపటి తర్వాత జరిగిన ఘటనను గుర్తించిన స్థానికులు పోలీసు లుకు అగ్ని మాపక సిబ్బందికి సమా చారం అందించారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఉన్న ఓ లోతైన బావిలో కారు పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే స్థానికుల సహాయంతో, క్రేన్‌ను రప్పించి కారును బయటకు తీశారు. అయితే అప్పటికే ఘోరం జరిగిపోయిం ది. కారు పూర్తిగా నీటిలో మునిగిపోవ డంతో శ్వాస ఆడక రాజు, భాగ్యతో పాటు ఆ ఇద్దరు పసికందులు కారులోనే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!