EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ పనులు పండుగకు ముందే పూర్తి చేయాలి..ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ బి. బాల మాయాదేవి.

📰 Generate e-Paper Clip

ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ పనులు పండుగకు ముందే పూర్తి చేయాలి..ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ బి. బాల మాయాదేవి.

ఎక్కువ తొలగింపులు, చేర్పులున్న పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి : ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ బి. బాల మాయాదేవి.

జనం వాయిస్‌, పెద్దపల్లి, అక్టోబరు 5:

ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న నోటీసులు, విచారణలను పండుగకు ముందే పూర్తి చేయాలని ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ బి. బాల మాయాదేవి అధికారులను ఆదేశించారు. సోమవారం పెద్దపల్లి ఐడీఓసీలో జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్‌ జె. అరుణ శ్రీతో కలిసి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాల మాయాదేవి మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన అన్ని రికార్డులను రీకన్సైల్‌ చేసి, నిర్ణీత కాలపట్టికను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రతి క్లెయిమ్‌, అభ్యంతరంపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పెండింగ్‌ లేకుండా చూడాలని ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో ఓటర్ల తొలగింపులు, చేర్పులు నమోదైన పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ప్రత్యేకంగా పరిశీలించాలని తెలిపారు. రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, వాటి మినిట్స్‌ను రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు.

అర్హులైన ఓటర్లను తుది జాబితాలో చేర్చాలి.

జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో గుర్తించిన అనామలీలు, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు జారీ చేసి అవసరమైన పత్రాలను సేకరిస్తున్నామని తెలిపారు. బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి వివరాలు, పత్రాలను సేకరిస్తున్నారని చెప్పారు. అర్హత ఉన్న ఓటర్లను నిబంధనల ప్రకారం తుది జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

18 ఏళ్లు నిండిన యువత నుంచి ఫారం-6 స్వీకరణ

2026 అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న అర్హులైన యువత నుంచి ఫారం-6 దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మున్సిపల్‌ ప్రాంతాల్లో వార్డు అధికారులు, ఇతర సిబ్బంది కూడా ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో పాల్గొంటూ బీఎల్‌ఓలకు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ నెల చివరి వారంలో మరోసారి జిల్లాను సందర్శించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిని పరిశీలిస్తామని ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ బాల మాయాదేవి తెలిపారు. సమీక్షలో ఆర్డీవోలు గంగయ్య, సురేష్‌, ఎన్నికల అధికారులు, తహసీల్దార్లు, బీఎల్‌ఓలు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!