EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ మళ్లీ పోటీ చేస్తారా? మహేశ్‌ గౌడ్‌ సమాధానమిదే!.

📰 Generate e-Paper Clip

ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌ మళ్లీ పోటీ చేస్తారా? మహేశ్‌ గౌడ్‌ సమాధానమిదే!.

ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ సిద్ధమన్న మహేశ్ గౌడ్
అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందని వెల్లడి.
దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు.
మళ్లీ ఆయన బరిలోకి దిగడంపై స్పష్టత ఇవ్వని మహేశ్‌ గౌడ్‌.
ప్రస్తుతానికి ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.

జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 19:

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. కోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించాలన్నది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

దానం నాగేందర్ మళ్లీ పోటీ చేస్తారా అనే ప్రశ్నకు మహేశ్ గౌడ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ విషయంలో హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పారు. అభ్యర్థి ఎంపికపై పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

దానం నాగేందర్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీనిపై దాఖలైన అనర్హత పిటిషన్లను విచారించిన హైకోర్టు.. నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించింది. 2024 ఏప్రిల్ 23 నుంచి అనర్హత వర్తిస్తుందని తీర్పు చెప్పింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారిందని స్పష్టం చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయింపులు జరగలేదని మహేశ్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఖైరతాబాద్ ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ వెలువడలేదు. హైకోర్టు తీర్పుతో అసెంబ్లీ స్థానం ఖాళీ కావడంతో ఎన్నికకు మార్గం ఏర్పడింది. అసెంబ్లీ కార్యదర్శి నుంచి సమాచారం అందిన తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!