EPAPER
Tuesday, June 2, 2026
Google search engine

రామగుండంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహణ.

📰 Generate e-Paper Clip

  • రామగుండంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నిర్వహణ.
  • ఉమ్మడి జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్.
  • జనం వాయిస్, రామగుండం, మే 18:
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్న సర్వేలో భాగంగా రామగుండంలో గణాంక శాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ సర్వే నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణ శ్రీ ని తన కార్యాలయంలో కలిసి సర్వే కరపత్రాలను అందించి సర్వే ప్రాముఖ్యతను వివరించారు. జాతీయ గణాంక శాఖ 2026వ సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులపై పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రామగుండంలో సర్వే చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పట్టణాలను, గ్రామాలను ఎంపిక చేసుకుని ప్రజల ఉపాధి స్థితిగతులపై సర్వేలో మొదట సాధారణ వివరాలతో సర్వే చేసిన,అనంతరం మొబైల్ ట్యాబ్ ద్వారా గ్రామంలోని కొన్ని కుటుంబాలను ఎంపిక చేసి మూడు నెలల పాటు నెలకు ఒకసారి పూర్తి సర్వే చేసి ప్రత్యేక ట్యాబ్లో వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు,సభ్యులు వారి విద్యా అర్హతల గురించి,చదువు మానేసిన,ఉన్నత చదువులు,వృత్తివిద్య కోర్సులు,ఉద్యోగం,స్వయం ఉపాధి,వివరాలు రోజువారి కూలీ అయితే వారంలో ఏ పని చేశారో,ఎన్ని గంటలు పని చేశారో,ఎంత వేతనం పొందారో వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వాళ్ళు అయితే వారి ఆదాయ వివరాలు , మరియు ఆన్లైన్ ఆర్డర్స్ ,ప్లాట్ఫారం వర్కర్స్, గిగ్గు వర్కర్స్  జొమాటో, స్విగ్గి ,  రాపిడో ,ఓలా , ఉబర్ వంటి ఆన్లైన్ ఆర్డర్స్ లో పనిచేసేటువంటి వ్యక్తుల యొక్క విషయాలను నమోదు చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్  చిదురాల నాగరాజ్ , మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ మహేందర్, మున్సిపల్ బిల్ కలెక్టర్ శ్రావణ్ మరియు మున్సిపల్ మెప్మా సెక్షన్ సిబ్బంది అధ్యక్షురాలు పర్స రజిత , ఆర్పీ ఠాకూర్ నాగరాణి , మరియు మున్సిపల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!