EPAPER
Tuesday, June 2, 2026
Google search engine

అంగన్ వాడీ ల్లో 15,982 ఖాళీ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

📰 Generate e-Paper Clip

అంగన్ వాడీ ల్లో 15,982 ఖాళీ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

జనం వాయిస్, తెలంగాణ బ్యూరో, మే 22:

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యో గులైన మహిళలకు త్వరలో తీపి కబురు చెప్పనుంది,  అంగన్‌ వాడీ కేంద్రాల్లో భారీ స్థాయిలో 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తుంది, ఈ ఏడాది లోగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పోస్టు ల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనునున్నారు.

అంగన్‌వాడీలలో కొంతమందికి ప్రమో షన్లు, మరికొందరు రిటైర్ అవుతున్నారు. ఈ మేరకు 2025- 2026నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు.2025-26 ఏడాది నాటికి పదోన్నతులు, పదవీ విరమణతో ఏర్పడిన ఖాళీలను పరిగణన లోకి తీసుకున్నారు. కొత్తగా ఏర్పడిన 708 ఉద్యోగాలను కూడా కలిపి 15,982 పోస్టులు భర్తీ చేయనున్నారు.

వీటిలో హెల్పెర్స్ పోస్టులు 12,882 ఉన్నాయి.. టీచర్‌ పోస్టులు 3,100 ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు ఉంటే.. సుమారు 71,562 మంది పనిచేస్తున్నా రు. వీరిలో టీచర్లు, వర్కర్లు ఉన్నారు.. అంగన్‌వాడీలలో గత మూడేళ్లుగా పదవీ విరమణ, సిబ్బందికి సూపర్‌వైజర్లుగా ప్రమోషన్లు వచ్చాయి. కొంతమందికి వేరే శాఖలలో శాశ్వత ఉద్యోగాలు రావడంతో ఖాళీలు వచ్చాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో 22.33శాతం పోస్టులు ఖాళీ అయ్యాయి.

త్వరలో శిశు సంక్షేమ శాఖ విద్యార్హతలు, నియామక విధానంపై క్లారిటీ ఇవ్వనుంది. ముందుగా అంగన్‌ వాడీలలో కొత్త నియా మక విధానానికి ఆమోదం తెలిపి.. ఆ తర్వాత జిల్లాల వారీ గా నోటిఫికేషన్లు విడు ద చేయనున్నారు.

అయితే అంగన్‌వాడీ ల్లో ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటుగా 9వేల కేంద్రాలకు కరెంట్ కనెక్షన్లు, 7,700 వేల కేంద్రాలకు మరుగుదొడ్డి, మరో 5 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. 3,300 కేంద్రాలకు తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. వెయ్యి కేంద్రాలకు శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. మొ త్తం మీద తెలంగాణ సర్కార్ ఈ ఏడాది అంగన్‌వాడీల్లో కొత్త కళ తీసుకురానుంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!