బీసీ ప్రజా సంఘం నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ గా కనుకుంట్ల అవినాష్.
జనం వాయిస్, గోదావరిఖని, మే 03:
తెలంగాణ బీసీ ప్రజా సంఘం రామగుండం నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ గోదావరిఖనికి చెందిన కనుకుంట్ల అవినాష్ ని నియమిస్తున్నట్లు తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్, రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు పోలవేణి నరేష్, ఉపాధ్యక్షుడు గర్వాందుల శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. గోదావరిఖని లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ అధ్యక్షుడు నరేష్ తనకు నియామకపత్రాన్ని అంద జేశారు. ఈ సందర్భంగా కనుకుంట్ల అవినాష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు బీసీల హక్కుల పోరాటం కోసం నా వంతు కృషి చేస్తానని అన్నారు. తన నియామకానికి సహకరించిన బీసీ నాయకులందరికీ కనుకుంట్ల అవినాష్ కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments